Sunday, 30 March 2025

శరీరం యదవాప్నోతి

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రా మతీశ్వరః। గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్॥8॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఎంతో అందమయిన పోలికలు చెబుతున్నాడు.అర్జునా!గాలికి వాసనలు ఏమీ లేవు స్వతహాగా.కానీ పిల్ల తెమ్మెరలు పూలమీదుగా పోయినప్పుడు,ఆ పూలసువాసనలను కూడా తీసుకెళతాయి తమతోటి.జీవుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళుతుంటాడు,ఒక జన్మ అయిపోయిన తర్వాత ఇంకో జన్మ ఎత్తేటప్పుడు.అలా మారే సమయంలో తన మునుపటి శరీరం నుంచి భావపరంపరను కూడా కొంచెం తీసుకెళతాడు.అందుకే చాలా సార్లు మనం పాత వాసనలు అంత తొందరగా పోవు అని అనుకుంటాము.